పాల వ్యాపారంలోకి పతంజలి.. కూరగాయల విక్రయాలు కూడా!

  • వచ్చే ఏడాది రూ.1000 కోట్ల వ్యాపారమే లక్ష్యం
  • ప్రతి రోజు 10 లక్షల లీటర్ల టార్గెట్
  • ఇతర సంస్థల కంటే తక్కువ ధరకే అమ్ముతామన్న రాందేవ్ బాబా
ఇప్పటికే పలు రకాల ఆయుర్వేద ఉత్పత్తులు, నిత్యావసర సరకుల వ్యాపారంలో దూసుకుపోతున్న బాబా రాందేవ్ కు చెందిన పతంజలి... త్వరలోనే పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. వచ్చే ఏడాది రూ. 1000 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నామని బాబా రాందేవ్ చెప్పారు. ఈ ఏడాది రూ. 500 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు 10 లక్షల లీటర్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పాల ఉత్పత్తుల ద్వారా పాడి పరిశ్రమ రైతులను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇతర సంస్థల కంటే రూ. 2 తక్కువకే పాలను విక్రయిస్తామని చెప్పారు. మరోవైపు కూరగాయలు, స్వీట్ కార్న్, బీన్స్ తదితర ఉత్పత్తులను కూడా విక్రయించే యోచనలో పతంజలి సంస్థ ఉంది.
Go Back to Shorts
patanjali
milk
business
ramdev baba

More Telugu News